మెగా స్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” రంగ రంగ వైభవంగా ”. హాట్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఓవర్ సీస్ లో షోలు ముందుగానే పడతాయి కాబట్టి టాక్ కూడా వచ్చేసింది. అంతేకాదు సినిమా చూస్తూ ట్విట్టర్ లో తమ తమ రివ్యూలను ఇచేస్తున్నారు.
ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం రంగ రంగ వైభవంగా సినిమా ఎలా ఉందో తెలుసా ……. యావరేజ్ అని వినబడుతోంది. అవును ఈ సినిమా కు ప్రేక్షకులు పూర్తిగా పాస్ మార్కులు వేయలేదు. కొంతమంది క్లీన్ లవ్ స్టోరీ అని అంటుంటే మరికొందరు ఫ్యామిలీ డ్రామా అని అంటున్నారు. ఓవరాల్ గా అయితే ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ పెద్దగా లేదని ఓవరాల్ గా యావరేజ్ సినిమా అనే అంటున్నారు.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ” ఉప్పెన ” బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే రెండో చిత్రం ” కొండపొలం ” మాత్రం డిజాస్టర్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు మూడో సినిమాకు కూడా పాజిటివ్ టాక్ లేదు. దాంతో మెగా అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు. అయితే ఓవర్ సీస్ ప్రేక్షకుల అభిప్రాయం అలా ఉండగా తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండనుందో కొద్దిసేపట్లోనే తేలనుంది. దాంతో రంగ రంగ వైభవంగా భవిష్యత్ ఏంటి ? అన్నది తేలనుంది.
Breaking News