Rangabaliఇటీవల కాలంలో సినిమాలు అంతగా ఆడటం లేదు. కథలో బలముంటేనే ఫర్వాలేదనిపిస్తున్నాయి. కథలో పట్టు లేకపోతే విజయం సాధించడం లేదు. ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమాలు కావడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడులు పోగా నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా రంగం ఆపసోపాలు పడుతోంది.
ఇటీవల నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం రంగబలి. దీనికి బసంశెట్టి పవన్ దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఎన్నో అంచనాలతో తెరకెక్కిన సినిమా డిజాస్టర్ కావడంతో డీలా పడిపోయారు. కలెక్షన్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. దీంతో సినిమా అపజయం అందరిని వేధిస్తోంది.
నాగశౌర్య మొదటి నుంచి కుటుంబ కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్రేక్షకుల్లో మంచి పట్టు సాధించాడు. కానీ రంగబలి మాత్రం అతడి నమ్మకాన్ని వమ్ము చేసింది. విడుదలైనప్పటి నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికంటే ముందు వచ్చిన సినిమా సామజవరగమన మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ రంగబలి మాత్రం సక్సెస్ ను అందుకోలేకపోయింది.
రంగబలి మొదటి నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సామజవరగమనకు మౌత్ టాక్ తోనే విజయం వరించింది. దానికి ప్రచారమే అక్కరలేదు. కానీ రంగబలి మొదటి నుంచి హిట్ టాక్ తెచ్చుకోలేదు. దీంతో కలెక్షన్లు అధ్వానంగా మారాయి. ఈ నేపథ్యంలో నాగశౌర్య పెళ్లి తరువాత నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నా విజయం మాత్రం దక్కలేదు.