కన్నడ చిత్ర పరిశ్రమ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పై వేటు వేసింది. రష్మిక మందన్న పై బ్యాన్ విధించింది. ఇకపై కొన్నాళ్ల పాటు రష్మిక మందన్నతో కన్నడ దర్శక నిర్మాతలు ఎవరు కూడా సినిమాలు చేయరు. ఒకవేళ రష్మిక తన తప్పు తెలుసుకొని సారీ చెబితే అప్పుడు బ్యాన్ ఎత్తివేయడం గురించి ఆలోచిస్తారేమో ……
అసలు విషయం ఏమిటంటే……. ఇంత రాద్ధాంతం ఎందుకు జరిగిందంటే ……. కన్నడ భామ అయిన రష్మిక మందన్న కన్నడ సినిమా కిరాక్ పార్టీ చిత్రంతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. మొదటి సినిమాతోనే విజయం అందుకుంది. అయితే ఆ వెంటనే తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ భామ. అందులో తన మొదటి చిత్రాన్ని నిర్మించింది సోకాల్డ్ బ్యానర్ అని అంది కానీ బ్యానర్ పేరు చెప్పలేదు. తనకు మొదటిసారి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలను గుర్తు పెట్టుకుంటారు కానీ ఈ భామ మాత్రం సోకాల్డ్ అనేసింది. ఇది కాక ఇటీవల పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన చిత్రం కాంతార . నేను ఆ సినిమా ఇంతవరకు చూడలేదు….. నాకు ఖాళీ లేదు అని అనేసింది.
ఇంకేముంది నెటిజన్లు అలాగే కన్నడ వాసులు రష్మిక మందన్న పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తలపొగరా అంటూ కన్నడ చిత్ర పరిశ్రమ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో రష్మిక మందన్న పై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది.