
రౌడీ హీరో విజయ్ దేవరకొండతో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే వేడుకలను జరుపుకుంది. ఏప్రిల్ 5 న రష్మిక మందన్న పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రష్మిక మందన్నకు ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడట. విజయ్ దేవరకొండ స్వయంగా రష్మిక చేతి వేలుకు ఆ రింగ్ తొడగడం సంచలనంగా మారింది.
విజయ్ – రష్మిక ఇద్దరు కూడా ఒకే ఇంట్లో అందునా ఒకే రూంలో కలిసి ఉంటున్నారు. రష్మిక మందన్న సోషల్ మీడియాలో నెటిజన్ల తో చిట్ చాట్ నిర్వహించిన తర్వాత కొద్దిసేపటికే విజయ్ దేవరకొండ కూడా ఆ ఇంట్లోనే దిగిన ఫోటోలు షేర్ చేయడంతో మరింత వైరల్ గా మారాయి. రష్మిక మందన్న పుట్టినరోజు వేడుకలను ఎవరినీ పిలవకుండా విజయ్ – రష్మికలు మాత్రమే చేసుకున్నారట.
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న గీతా గోవిందం , డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. గీతా గోవిందం సూపర్ హిట్ కాగా డియర్ కామ్రేడ్ చిత్రం మాత్రం అంతగా ఆడలేదు. అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. ఇక అప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే వస్తున్న ఊహాగానాలను ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తూ వచ్చారు కానీ ఇటీవల మాత్రం ఆ వార్తలను కొట్టి పడేయడం లేదు. దానికి తోడు విజయ్ తన కుటుంబంతో ఫారిన్ కు వెళ్లినా రష్మిక వాళ్లతో వెళుతోంది. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో కూడా తరచుగా విజయ్ ఇంటికి వెళుతోంది. దాంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడేమో ఏకంగా రింగ్ కూడా తొడిగేసాడట.






