స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హాట్ స్టిల్ ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతోంది. లైక్స్ , షేర్ , రీ ట్వీట్ లతో రష్మిక హాట్ స్టిల్ ను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు కొంతమంది. రష్మిక మందన్న ఈ ఫోజులో నిజంగానే చాలా చాలా హాట్ గా ఉంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన వారిసు చిత్రంలోనిది ఈ హాట్ స్టిల్.
ఇటీవల రష్మిక మందన్న విజయ్ సరసన వారిసు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో రష్మిక మందన్న కు పెద్దగా నటించడానికి అవకాశం లేకుండా పోయింది కానీ ఇలా అందాల ప్రదర్శన మాత్రం రెచ్చిపోయి చేసింది. ఇక పాటలోని ఈ హాట్ స్టిల్ ను కట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు…… రష్మిక అందాలను చూస్తూ ఊహలోకల్లో తేలిపోతున్నారు.
రష్మిక మందన్న సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేసింది. కానీ ఈ భామ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. దాంతో మళ్లీ సౌత్ పైనే దృష్టి పెట్టింది. అయితే పుష్ప 2 చిత్రం ఉంది కాబట్టి తప్పకుండా ఆ చిత్రంతో తాను అనుకున్న దాన్ని సాధించగలను అని గట్టిగా నమ్ముతోంది. భారీగా ఆశలు పెట్టుకుంది పుష్ప 2 పైన.
ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఈ భామ ఘాటు ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రౌడీ హీరో దుబాయ్ వెళితే …… ఈ భామ కూడా దుబాయ్ వెళుతోంది. అలాగే ముంబై వెళితే …… అక్కడకు కూడా వెళుతోంది. ఇన్ని జరుగుతుంటే …….సోషల్ మీడియాలో ఇద్దరి గురించి ….. ప్రేమ వ్యవహారం గురించి కథనాలు వస్తుంటే ……. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని పరమ రొటీన్ డైలాగ్ ను వాడుతోంది.