హాట్ భామ రష్మిక మందన్న దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తోంది. పుష్ప 2 భారీ విజయం సాధించడంతో ఈ భామ ఫుల్లుగా డిమాండ్ చేస్తోంది. ఈ భామ డిమాండ్ విని దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారు. అయితే రష్మిక కు ఆ క్రేజ్ ఉండటంతో తప్పడం లేదు పాపం. ఈ భామ అడిగినంత సమర్పించుకోవడానికి రెడీ అవుతున్నారు.
తాజాగా ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలో రష్మిక మందన్నను హీరోయిన్ గా తీసుకోవాలని సంప్రదించారట. ఈ భామ చెప్పిన రెమ్యునరేషన్ విని షాక్ అయ్యారట. అయితే రష్మిక రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో ఉంది కాబట్టి ఇవ్వడంలో తప్పేముంది అని తమకు తాము సర్దిచెప్పుకున్నారట. దాంతో ఈ భామకు ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట.
మొదట ఈ సినిమాలో సమంతను తీసుకోవాలని అనుకున్నారు. ఆ భామ కూడా 5 కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో 3 కోట్లు ఇస్తామని బేరం పెట్టారు. సమంత ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేసింది. దాంతో రష్మిక ను సంప్రదించారు. కానీ ఈ భామ కూడా 5 కోట్లు డిమాండ్ చేయడంతో ఇవ్వక తప్పలేదట. రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారట దర్శక నిర్మాతలు.