స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలుగుతున్న భామ రష్మిక మందన్న. కన్నడ భామ అయిన రష్మిక మందన్న తెలుగునాట మాత్రమే కాకుండా సౌత్ లో అంతటా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పుడేమో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. అయితే ఈ భామ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తుందని , పైగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని జోస్యం చెప్పాడు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి.
కర్ణాటక రాజకీయాల్లోకి రష్మిక మందన్న ఎంటర్ అవుతుందని , అయితే భారతీయ జనతా పార్టీ లో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని , రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుందని అంటున్నాడు వేణు స్వామి. ఇతగాడు ఇంతకుముందు పలు సెలబ్రిటీల విషయంలో జోస్యం చెప్పాడు. అందులో కొన్ని నిజమయ్యాయి కూడా దాంతో యితడు చెప్పే విషయాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రష్మిక రాజకీయ జీవితం గురించి పక్కన పెడితే సినిమాల విషయానికి వస్తే ……. పుష్ప 2 చిత్రం కోసం సన్నద్ధం అవుతోంది రష్మిక. పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది. దాంతో పుష్ప 2 పై భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక త్వరలోనే రష్మిక కూడా ఈ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.