
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంతార హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. నన్ను కిరాక్ పార్టీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం చేసింది రిషబ్ శెట్టి , రక్షిత్ శెట్టి అని , వాళ్ళ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని …… నాకు అవకాశం ఇచ్చిన ఆ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటానని వ్యాఖ్యానించింది. కిరాక్ పార్టీ చిత్రంలో హీరోగా రక్షిత్ శెట్టి నటించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక మందన్నకు భారీగా అవకాశాలు వచ్చి పడ్డాయి.
ఇక ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టి తో రష్మిక మందన్న ప్రేమలో పడింది. ఈ ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ఆ పెళ్లి పెటాకులు అయ్యింది. అందుకు కారణం విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం చిత్రంలో నటించడమే కారణమని ఊహాగానాలు వినిపించాయి అప్పట్లో…… ఎందుకంటే ఆ చిత్రంలో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న రొమాంటిక్ సీన్స్ లో రక్తి కట్టించడమే అనే వాదన ఉంది.
ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్…… అంతేకాదు పాన్ ఇండియా స్టార్ కూడా. అయితే ఇటీవల రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార పాన్ ఇండియా చిత్రంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా చూడలేదని రష్మిక కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు రష్మికను అదేపనిగా ట్రోల్ చేశారు నెటిజన్లు. కట్ చేస్తే ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు రష్మిక మందన్నలో ఎంత మార్పు అంటూ ఆశ్చర్య పోతున్నారు నెటిజన్లు. ఎందుకంటే ……. రిషబ్ శెట్టి , రక్షిత్ శెట్టి పేర్లను పలకని రష్మిక ఇప్పుడు వాళ్లకు థాంక్స్ చెప్పడం …… వాళ్ళ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.