Rashmi Gautam ప్రముఖ వ్యాఖ్యాత రష్మీ గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ తో జీవితం ప్రారంభించి ఇప్పుడు మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం ఉందని పుకారు చేసినా అందులో నిజం లేదని తేలిపోయింది. దీంతో రష్మీ మూగజీవాల కోసం తపించిపోతుంది. వాటికెవరైనా హాని కలిగిస్తే ఉపేక్షించదు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. కుక్కలను కూడా ఎవరు హింసించకూడదని చెబుతుంది.
ఇటీవల విడుదలైన ఓ వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క పట్ల తీవ్రంగా ప్రవర్తిస్తున్నాు. దాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ వీడియో చూసి రష్మీ చలించిపోయింది. మూగ జంతువును ఎందుకలా హింసిస్తున్నాడని ప్రశ్నిస్తోంది. ఘటనపై ఢిల్లీ పోలీసులకు, పెటా సంస్థకు, ఎంపీ మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. కుక్కను కాపాడాలని కోరింది.
రష్మీ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అతడు ఉన్మాదిలా ఉన్నాడని పేర్కొంది. రష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బక్రీద్ సందర్భంగా ముస్లింలు జంతువులను వధించడంపై కూడా రష్మీ ట్వీట్ చేసింది. దీంతో ముస్లింలు ఆమెపై ఆగ్రహంతో ఉన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వారు మండిపడుతున్నారు.
గతంలో హైదరాబాద్ లో వీధి కుక్కలు బాలుడిని చంపిన ఘటనలో కుక్కలకు మద్దతుగా మాట్లాడినందుకు రష్మీ విమర్శలు ఎదుర్కొంది. రష్మీ బ్లూ క్రాస్ మెంబర్ అయినా ఇంతలా జంతువులకు మద్దతుగా నిలవడంపై విమర్శలు ఎదర్కొన్న రష్మీపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. రష్మీ వివాదాల్లో చిక్కుకుంటోంది.