మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ధమాకా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రవితేజ ఇప్పటి వరకు పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. అయితే 100 కోట్ల సినిమా ఇప్పటి వరకు రవితేజకు లేదు. ఆ లోటు ధమాకా తీర్చబోతోంది. డిసెంబర్ 23 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 89 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈరోజు రేపటితో 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం ఖాయం.
అంటే 12 రోజుల్లోనే రవితేజ 100 కోట్ల మైలురాయిని అందుకున్నాడన్న మాట. బాక్సాఫీస్ వద్ద రవితేజకు పోటీ నిచ్చే చిత్రం మరో వారం రోజుల వరకు లేదు కాబట్టి తప్పకుండా అప్పటి వరకు ధమాకా మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయంగా కనబడుతోంది. అంటే ఈ లెక్కన ధమాకా మొత్తంగా 120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం కనబడుతోంది.
రవితేజ హీరోగా నటించగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. రవితేజ యాక్షన్ అలాగే శ్రీ లీల గ్లామర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రవితేజ కెరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమా కానుండటం విశేషం. ఇక ధమాకా చిత్రాన్ని కొన్న బయ్యర్లు భారీగా లాభాలను పొందుతున్నారు.