మాస్ మహారాజ్ రవితేజ ధమాకా చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. డిసెంబర్ 23 న విడుదలైన ధమాకా చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఇక ఆ ఓపెనింగ్స్ అలాగే 8 రోజులుగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మొత్తంగా 8 రోజుల్లో 69 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ జోరు చూస్తుంటే ఖచ్చితంగా 100 కోట్ల వసూళ్లను సాధిస్తుందా ? అనే ఆతృత నెలకొంది.
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ లీల గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. శ్రీలీల అందాలు కుర్రాళ్లను పిచ్చెక్కించాయి. రవితేజ యాక్షన్ శ్రీ లీల గ్లామర్ , మిగతా నటీనటుల కామెడీ మొత్తానికి అన్నీ కలగలిపిన చిత్రంగా రూపొందింది. దాంతో ధమాకా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చాలా రోజుల తర్వాత రవితేజకు కిక్ ఇచ్చే హిట్ లభించింది.
ధమాకా చిత్రాన్ని కొన్న బయ్యర్లు భారీగా లాభాలు పొందుతున్నారు. దాంతో బయ్యర్లు కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. గతకొంత కాలంగా రవితేజ సినిమాలను కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు ….. అయితే సరిగ్గా ఇదే సమయంలో ధమాకా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.