
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ” రావణాసుర ”. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7 న భారీ ఎత్తున విడుదల కానుంది. విడుదలకు సిద్ధం కావడంతో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ” A ” సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ సినిమాలో హింసాత్మక సంఘటనలు, బూతులు కూడా ఎక్కువగా ఉన్నాయట మరి.
రక్తపాతం ఎక్కువగా ఉండటంతో ” ఏ ” సర్టిఫికెట్ ఇచ్చారట. ఇక ఈ సినిమా తప్పకుండా యాక్షన్ కోరుకునే ప్రేక్షకులకు నచ్చడం ఖాయమని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. సెన్సార్ సభ్యులు కూడా దర్శక నిర్మాతలకు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేసారట. సెన్సార్ సభ్యులు హిట్ కొడతారని చెప్పడంతో దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో అందమైన భామలు చాలామందే నటించారు. పూజిత పొన్నాడ , దక్షా నగార్కర్ , ఫరియా అబ్దుల్లా , మేఘా ఆకాష్ , అను ఇమ్మాన్యుయేల్, ప్రియాంక అరుళ్ మోహన్ తదితరులు నటించడం విశేషం. ఇక సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించాడు. రవితేజ ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.
ఇటీవల కాలంలో రవితేజ నటించిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి దాంతో రావణాసుర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో కూడా రవితేజ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ ను కుమ్మేసింది దాంతో రావణాసుర చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.






