మాస్ మహారాజ్ రవితేజ హీరోయిన్ శియా గౌతమ్ పెళ్లి చేసుకుంది. విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియపరిచింది దాంతో ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్లు అలాగే పలువురు సినీ ప్రముఖులు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” నేనింతే ”. ఈ సినిమా పూరీ జగన్నాథ్ సొంత సినిమా కావడం విశేషం. అప్పట్లో రవితేజ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అంటే హాట్ కేక్ అనే చెప్పాలి. ఎందుకంటే పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి ఈ కాంబినేషన్ లో.
అయితే అలాంటి సమయంలో నేనింతే లాంటి డిఫరెంట్ జోనర్ సినిమా చేసాడు పూరీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది శియా గౌతమ్. నేనింతే సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో పాపం ఈ భామకు పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. కొన్ని చిన్న సినిమాల్లో నటించింది కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు దాంతో సినిమాలు లేకుండా పోయాయి.
అయితే ఇతర భాషల్లో కొన్ని సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది దాంతో తాజాగా పెళ్లి చేసుకుంది. నిఖిల్ ఫాల్కేవాలా అనే ముంబై కి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది శియా గౌతమ్. అందం , అభినయం ఉన్నప్పటికీ పాపం ఈ భామకు అదృష్టం దక్కలేదు. ఇటీవలే గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ చిత్రంలో వ్యాంప్ పాత్రలో నటించింది. అన్నట్లు సినిమాల్లో ఈ భామ పేరు శియా గౌతమ్ కానీ అసలు పేరు అదితి గౌతమ్.
View this post on Instagram