
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ” ధమాకా ”. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 23 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. దాంతో ఈరోజు సాయంత్రం ధమాకా ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే ……. పక్కాగా మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. రవితేజ మాస్ మహారాజ్ కావడంతో ఆ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ధమాకా రూపొందించినట్లు తెలుస్తోంది.
గతకొంత కాలంగా రవితేజ నటించిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందుతూనే ఉన్నాయి. కనీసం 10 కోట్ల వసూళ్లను కూడా సాధించలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతున్నాయి. అయితే వరుస ప్లాప్ లకు ధమాకా చిత్రం చరమ గీతం పాడుతుందని భావిస్తున్నారు. ధమాకా చిత్రం పై రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు. తనకు మళ్ళీ పూర్వ వైభవం తెచ్చిపెడుతుందన్న ధీమాలో ఉన్నాడు రవితేజ.
ఈ చిత్రంలో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఈ భామ పెళ్లి సందడి చిత్రంతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే.