36.5 C
India
Friday, April 10, 2026
More

    రావణాసుర ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే

    Date:

    raviteja ravanasura twitter review
    raviteja ravanasura twitter review

    మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ” రావణాసుర ”. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించాడు. మేఘా ఆకాష్ , దక్ష నగార్కర్ , అను ఇమ్మాన్యుయేల్ , ఫరియా అబ్దుల్లా , ప్రియాంకా అరుళ్ మోహన్ , సుశాంత్ తదితరులు నటించిన రావణాసుర ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.

    ఓవర్ సీస్ లో రావణాసుర షోలు పడ్డాయి అలాగే ఇక్కడ కూడా కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి దాంతో ఈ సినిమాను చూసిన వాళ్ళు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో ఇస్తున్నారు. ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం రావణాసుర సినిమా ఎలా ఉందో తెలుసా ……. మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

    కొంతమంది బాగుందని అంటుంటే మరికొందరు మాత్రం అన్నా ! ఖిలాడీ , నిప్పు లాంటి సినిమాలు చేయకన్నా అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ట్విస్ట్ లు బాగున్నాయని….. సూపర్ హిట్ కొట్టావని ట్వీట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అసలైన ఫలితం మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు కొద్దిసేపట్లోనే ఇవ్వనున్నారు.

    రవితేజ ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ లను అందుకున్నాడు. ధమాకా బాక్సాఫీస్ ను కుమ్మేసింది. ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు రవితేజ. ఆ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. దాంతో రావణాసుర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుంటుందా ? లేదా ? అన్నది కొద్దిసేపట్లోనే తేలనుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ravi Teja : ఆవేశం’ను సొంతం చేసుకున్న రవితేజ..!

    Ravi Teja : ఏప్రిల్ లో రిలీజైన ఫహద్ ఫాసిల్ నటించిన...

    Faria Abdullah : అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న జాతిరత్నం బ్యూటీ

    Faria Abdullah : జాతిరత్నం ఫేమ్ ఫరియా అబ్దుల్లా తన అందాలను...

    Ravi Teja: వెంటిలెటర్ పై రవితేజ.. ఆ షూటింగ్ చేస్తూ గాయపడిన మాస్ మహరాజ్.. వైద్యులు ఏమంటున్నారంటే..?

    Ravi Teja: మాస్ మహరాజ్ గా గుర్తింపు సంపాదించుకున్న రవితేజకు తెలుగుతో...

    Mr. Bachchan : మూవీ రివ్యూ : మిస్టర్ బచ్చన్ హిట్టా.. ఫట్టా

    నటినటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, రోహిణి, అన్నపూర్ణ,...