
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన రావణాసుర చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి కృతం విడుదల అయ్యింది. ఇక ట్రైలర్ చూస్తుంటే పక్కా మాస్ మసాలా చిత్రం అని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. అసలు టైటిల్ రావణాసుర అనేదే మాస్ టైటిల్ దానికి తగ్గట్లుగానే భారీ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ నిండిపోయింది. ”ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే ” అనే డైలాగ్ తో మాస్ ప్రేక్షకులకు కావలసినంత కిక్ ఇచ్చాడు రవితేజ.
సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ , మేఘా ఆకాష్ , ఫరియా అబ్దుల్లా , దక్షా నగార్కర్ , పూజిత పొన్నాడ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7 న ప్రపంచ వ్యాప్తంగా రావణాసుర చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక రవితేజ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రవితేజ. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ను కుమ్మేసింది. ఈ సినిమాలో రవితేజ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో రావణాసుర చిత్రంతో హ్యాట్రిక్ కొడతాడనే ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.