RRR సినిమాతో ఆల్ ఓవర్ ఇండియన్ సినీ లవర్స్ కి దగ్గర అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇకపై తాను చేసే ప్రాజెక్టులన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఆర్సీ 15 చేస్తున్న చరణ్ రెండు విభిన్న పాత్రలతో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒకటి విలేజ్ రోల్ కాగా మరొకటి స్టైలిష్ రోల్ అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టు వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కన్నడ హీరో ఉపేంద్ర ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో ఆయన చేయాలనుకున్నరోల్ కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఓ విప్లవ నాయకుడి పాత్ర కోసం ఉపేంద్రను తీసుకోవాలని భావిస్తున్నారట. పైగా ఈ రోల్ చరణ్ పాత్రకు గురువు పాత్ర అని టాక్ వినిపిస్తుది. మాములుగా నే ఇలాంటి రోల్స్ లో ఇరగదీసే ఆయన ..ఆ రోల్ కు తగిన న్యాయం చేస్తాడని భావిస్తున్నారు.
పోరాటంతోనే దేశంలో అవినీతిని తరిమి కొట్టవచ్చుఅని నమ్మడంతో పాటు దానిని ఆచరణలో పెట్టే నాయకుడిగా పాత్ర ఇప్పటికే చాలా మందిని అనుకున్నారట. కానీ ఫైనల్ గా ఉపేంద్ర ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ స్పెషల్ రోల్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. ఇక ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్ తో పాటు ఖుష్బూ కూడా నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ బద్దలు కొట్టాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది.