తన అనారోగ్యాన్ని ఎట్టకేలకు బయట పెట్టింది రేణు దేశాయ్. గతకొంత కాలంగా గుండె , ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని , చికిత్స పొందుతూ స్వాంతన చేకూరేలా యోగా కూడా చేస్తున్నానని తప్పకుండా కోలుకుని మళ్లీ షూటింగ్ లలో పాల్గొంటానని అంటోంది రేణు దేశాయ్.
గుండె , ఇతర అనారోగ్య సమస్యలు అని అంది కానీ స్పష్టంగా ఎలాంటి రోగం అనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా , ఎన్ని బాధలు పడుతున్నా ధైర్యంగా నిలబడాలని …… పోరాటం చేయాలని అంటోంది. అంతేకాదు కష్టాలు ఎదురు కాగానే ధైర్యం కోల్పోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ధైర్యంగా నిలబడాలని చెప్పడానికే నా అనారోగ్యం గురించి చెబుతున్నానంది రేణు దేశాయ్.
పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలతో పూణే లోనే ఎక్కువ కాలం ఉన్న రేణు దేశాయ్ ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా ఉంటోంది. తన పిల్లలను చదివించుకుంటూ సినిమాల్లో కూడా నటిస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో కీలక పాత్రలో నటిస్తోంది రేణు దేశాయ్. ఒకప్పుడు హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన రేణు దేశాయ్ ఇప్పుడు ప్రాధాన్యమున్న పాత్రలను పోషించడానికి రెడీ అంటోంది.