రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ” టైగర్ నాగేశ్వర్ రావు ”. స్టూవర్టుపురం దొంగ అయిన టైగర్ నాగేశ్వర్ రావు అప్పట్లో పెను సంచలనం సృష్టించాడు. అటు పోలీసులను ఇటు కొంతమంది ప్రజలకు నిద్రలేకుండా చేసాడు. అలాంటి వ్యక్తి బయోపిక్ రూపొందుతోంది. కాగా ఆ ఆసినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంలో ” హేమలత లవణం ” అనే క్యారెక్టర్ పోషిస్తోంది రేణు దేశాయ్. కాగా తన పాత్రకు సంబందించిన సన్నివేశాలు అలాగే డైలాగ్స్ ని దర్శకుడు వంశీ పంపించాడట. దాంతో తన సన్నివేశాలను చూసి సంతోషించింది. దాంతో ఆ స్క్రిప్ట్ కు సంబందించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టింది.
పవన్ కళ్యాణ్ తో విడిపోయాక పూణే వెళ్ళిపోయింది రేణు దేశాయ్. తన ఇద్దరు పిల్లలతో ఉంటున్న రేణు దేశాయ్ కు రెండో పెళ్లి మీద గాలి మళ్లింది. ఆమధ్య ఓ వ్యక్తితో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లి గురించి మాత్రం వెల్లడించలేదు. ఆ పెళ్లి ఏమయ్యిందో తెలీదు. ఇటీవల మళ్ళీ పెళ్లి గురించి వ్యాఖ్యానించింది రేణు దేశాయ్. అంటే త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఖాయమే అని తెలుస్తోంది.