ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేస్తే మంచిదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మేడారం సమ్మక్క – సారలమ్మ లను దర్శించుకొని పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో దూషించాడు.
ప్రగతి భవన్ లో 150 గదులు ఉన్నాయని , ఆ ప్రగతి భవన్ లో సామాన్యులు అడుగు పెట్టే అవకాశం లేదని , కానీ కాంట్రాక్టర్లకు బ్రోకర్లకు మాత్రమే ఎంట్రీ ఉందని …… అలాంటి ప్రగతి భవన్ ను నక్సలైట్లు కూల్చేస్తే మనకు వచ్చే నష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవే మాటలు BRS నాయకులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దాంతో తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను తగుల బెట్టాలని పిలుపునిచ్చింది BRS పార్టీ. అంతేకాదు వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లలో రేవంత్ రెడ్డి పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. రేవంత్ పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.