
వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి శ్రీకారం చుడుతున్నారు. వ్యూహం అనే టైటిల్ తో రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 2023 జనవరి 26 న వ్యూహం చిత్రం ప్రారంభం కానుంది. ఇక ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగనుంది. ఈ సినిమాను వైసీపీ నాయకులు నిర్మిస్తున్నారు.
ఆమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాంగోపాల్ వర్మ కలిసిన విషయం తెలిసిందే. అప్పుడే ఈ ఊహాగానాలు వచ్చాయి. ఇక ఇప్పుడు అది నిజమని రుజువయ్యింది. ఏపీలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు …… అయితే తెలుగుదేశం , జనసేన పార్టీలు కలిస్తే కొంత నష్టం జరిగే అవకాశం ఉండటంతో ఆ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయ వ్యంగ్య చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.
వర్మ సినిమా వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అని తెలుసు. కానీ సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ……. 2019 ఎన్నికలకు ముందు వర్మ తీసిన ” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” చిత్రం తెలుగుదేశం పార్టీని బాగానే డ్యామేజ్ చేసింది. దాంతో ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు వర్మ చేత వ్యూహం అనే చిత్రాన్ని తీయిస్తున్నారు వైసీపీ పెద్దలు. 2019 లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి దాంతో ఇలా వ్యూహం పన్నాడు జగన్.