పెద్దనాన్న కృష్ణంరాజు అంటే డార్లింగ్ ప్రభాస్ కు చాలా చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. రారాజుగా వెలుగొందిన కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దాంతో వెంటనే కృష్ణంరాజు విగ్రహం చేయించాలని భావించి అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని వడయార్ అనే కళాకారుడికి పనులు అప్పగించారు. అతడి ఆలస్యం చేయకుండా కృష్ణంరాజు విగ్రహాన్ని చేసాడు. తుది మెరుగులు దిద్ది ఈరోజు హైదరాబాద్ కు తరలించారు ఆ విగ్రహాన్ని.
కృష్ణంరాజు పెద్ద కర్మ జరిపే సమయానికి విగ్రహం ఉండాలని భావించి ఇలా చేసారు. అందుకు తగ్గట్లుగానే శిల్పి అద్భుతంగ కృష్ణంరాజు నిజంగానే ఉన్నాడు అనేలా విగ్రహాన్ని రూపొందించాడు. తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన రెబల్ స్టార్ జీవితంలో అన్నీ అనుభవించాడు కానీ ప్రభాస్ పెళ్లి చేయాలనీ అలాగే తన కూతుర్ల పెళ్లి చేయాలనే ఆశ మాత్రం తీరకుండానే చనిపోయారు.