నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం NBK108. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతమైన బాచుపల్లిలో జరుగుతోంది. పలువురు జూనియర్ ఆర్టిస్ట్ లు అలాగే బాలయ్య , శరత్ కుమార్ , శ్రీలీల తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు అనిల్ రావిపూడి.
అయితే జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నారట. షూటింగ్ అంటే తెల్లవారుఝామునే లొకేషన్ లో ఉండాలి. దాంతో తెల్లవారుఝామున 5 గంటల సమయంలో బాచుపల్లికి జూనియర్ ఆర్టిస్టులను తరలిస్తున్న క్రమంలో ఓ వాహనం అదుపుతప్పి ప్రగతి నగర్ చెరువు దగ్గర బోల్తా పడింది. దాంతో పలువురు జూనియర్ ఆర్టిస్ట్ లకు గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.