
నాటు నాటు పాట రాసిన రచయిత చంద్రబోస్ స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడంతో చంద్రబోస్ స్వగ్రామమైన వరంగల్ జిల్లా చల్లగరిగ లో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. మా ఊరి కుర్రాడు ఆస్కార్ సాధించడం అంటే మాటలు కాదు . మా ఊరికి ఇంతటి గొప్పతనం తీసుకొచ్చిన చంద్రబోస్ నిజంగా అభినందనీయుడు అంటూ చంద్రబోస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గేయ రచయిత చంద్రబోస్ ఇప్పటి వరకు దాదాపు అయిదు వేల పాటలను రాసాడు. చంద్రబోస్ పాటలలో చేసిన పదప్రయోగం అతడ్ని ప్రత్యేకంగా నిలిపింది. సాధారణ మనుషులకు కూడా అర్థమయ్యేలా పాటలను రాసి తన ప్రత్యేకత చాటుకున్నాడు. తెలుగులో అనేక సూపర్ హిట్ పాటలను రాసిన చంద్రబోస్ నాటు నాటు పాటతో ఆస్కార్ సాధించాడు.