నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు అంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పై బూతుల వర్షం కురిపించాడు మెగా బ్రదర్ నాగబాబు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రమోషన్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారని , ఆ డబ్బులతో నేను 8 సినిమాలు తీసి వాళ్ళ ముఖాన కొట్టేవాడని అంటూ ఓ ప్రెస్ మీట్ లో తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో తీవ్ర కలకలం సృష్టించాయి.
తమ్మారెడ్డి వ్యాఖ్యల పట్ల టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డును గెలుచుకునే సువర్ణావకాశం లభించిన ఈ సమయంలో అందరం మన తెలుగు సినిమా , ఓ భారతీయ సినిమా సాధిస్తున్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి….. పొంగిపోవాలి కానీ ఇలా విమర్శలు చేయడం ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ విమర్శలు ఎవరో చేస్తే తెలియక చేసారు అనుకోవచ్చు….. సినిమా రంగంలో ఎంతో సీనియర్ అయినటువంటి తమ్మారెడ్డి ఇలా వ్కాఖ్యానించడం సరికాదని అంటున్నారు.
ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే తమ్మారెడ్డి పై బూతుల వర్షం కురిపించాడు. నీ అమ్మా మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు అంటూ తిట్టేసాడు. నాగబాబుకు బాగా కాలినట్లుంది అందుకే బూతులు తిట్టేసాడు. పాపం అందరి విమర్శలతో తమ్మారెడ్డి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. తెలిసిన వాళ్ళు , తెలియని వాళ్ళు తమ్మారెడ్డికి ఫోన్ చేసి తిడుతున్నారట.