
భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆస్కార్ రానే వచ్చింది. నాటు నాటు అనే పాటకు బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో అవార్డు వచ్చింది. భారతీయుల కల నిజమైన వేళ ……. ఆస్కార్ అవార్డు ను ప్రకటించిన వేళ అంబరాన్నంటాయి సంబరాలు. ఇక భారత్ లో అయితే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ , చరణ్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.
నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలవడం ప్రతీ భారతీయుడికి గర్వకారణం అనే చెప్పాలి. భారత్ వందేళ్ల కల ఆస్కార్. ఆ ఆస్కార్ 95 వ ఆస్కార్ వేడుకలో ఏకంగా భారత్ రెండు ఆస్కార్ లను గెలవడం విశేషం. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ” ది ఎలిఫెంట్ విష్పరర్స్ ” ఆస్కార్ గెలుచుకోగా నాటు నాటు అనే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో కూడా ఆస్కార్ సాధించడం సంచలనంగా మారింది. దాంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 #NaatuNaatu #RRRMovie #Oscars95 pic.twitter.com/yIDgYJlTXH
— RRR Movie (@RRRMovie) March 13, 2023