
జపాన్ వెళ్లారు స్టార్ హీరోలు ఎన్టీఆర్ , చరణ్ . ఎందుకోసమో తెలుసా ……. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది మార్చిలో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్ల వసూళ్లను సాధించింది.
ఇక ఇపుడేమో జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జపాన్ లో భారీ ఎత్తున విడుదల అవుతున్న సందర్బంగా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ లలో పాల్గొనడానికి దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తో పాటుగా ఎన్టీఆర్ , చరణ్ లు జపాన్ వెళ్లారు. అక్కడ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసి రిజల్ట్ వచ్చాక మళ్ళీ ఇండియాకు రానున్నారు. ఆ తర్వాతే తమ తదుపరి చిత్రాలను చేయనున్నారు ఎన్టీఆర్ , చరణ్ .