ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో బ్రిటీష్ వాళ్ళను విలన్లుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసారు బ్రిటీష్ నెటిజన్లు. మమ్మల్ని విలన్లుగా చూపిస్తారా ? అంటూ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు స్పందించాడు జక్కన్న. సినిమాను సినిమాగానే చూడండి. ఆ విషయం ప్రేక్షకులకు బాగా తెలుసు కాబట్టే బ్రిటన్ లో కూడా మా ఆర్ ఆర్ ఆర్ సూపర్ హిట్ అయ్యిందంటూ కౌంటరిచ్చాడు.
అంతేకాదు సినిమా ప్రారంభంలో గమనిక ఒకసారి చూసే ఉంటారు ……. ఒకవేళ చూడకపోయినా ఫరవాలేదు ……. ఆర్ ఆర్ ఆర్ అనేది ఒక సినిమా కథ మాత్రమే …… పాఠం కాదు. సినిమాని సినిమాగా చూస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడే సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారు అంటూ కౌంటర్ ఇచ్చాడు జక్కన్న.
ఎన్టీఆర్ , రాంచరణ్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది మార్చి 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1200 కోట్ల వసూళ్లను సాధించింది. ఆస్కార్ బరిలో నిలుస్తుందని అనుకున్నారు కానీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఆర్ ఆర్ ని తప్పించడంతో చాలా కోపంగా ఉన్నారు. అయితే అమెరికాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన వాళ్ళు మాత్రం పెద్ద లాబీయింగ్ చేస్తున్నారు ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ ఉండాలని.