ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ”. ఈ ఏడాదిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి సంచలనం సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలవాలని అనుకున్నారు. అయితే ఊహించనివిధంగా ఇండియా నుండి ఆర్ ఆర్ ఆర్ ని కాకుండా గుజరాతీ ఫిలిం చెల్లో షోను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
దాంతో ఆర్ ఆర్ ఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు ….. తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కట్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని అమెరికాలో విడుదల చేసిన వేరియల్స్ ఫిలిం సంస్థ ఆస్కార్ అకాడెమీని అభ్యర్ధించింది. దాంతో ఆస్కార్ అకాడెమి అనుమతి ఇచ్చింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం సబ్ టైటిల్స్ తో లాస్ ఏంజెల్స్ లో వారం రోజుల పాటు ప్రదర్శితం కావడంతో ఆస్కార్ బరిలో నిలిచే ఛాన్స్ లభించింది.
ఇక ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ కు ఎన్ని అవార్డులు వస్తాయో తెలీదు కానీ ఏకంగా 15 విభాగాల్లో ఈ సినిమా పోటీ పడుతోంది. ఉత్తమ నటులు ఎన్టీఆర్ – చరణ్ , ఉత్తమ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి , ఉత్తమ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి , ఉత్తమ నిర్మాణ సంస్థ దానయ్య , ఉత్తమ సహాయ నటుడు అజయ్ దేవ్ గన్ ఇలా పలు రకాలుగా పోటీ పడుతోంది ఆర్ ఆర్ ఆర్.