స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం పై మరోసారి పుకార్లు షికారు చేస్తున్నాయి. సమంత పరిస్థితి విషమంగా ఉందని , దాంతో ఫారిన్ కు తీసుకులుతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు జోరుగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో సమంత మీడియా ముందుకు రాకపోవడంతో పాటుగా యశోద సినిమా విడుదలకు ముందు తనకు అనారోగ్యం సోకినట్లుగా , మాయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమంత ప్రకటించడం కూడా ఈ ఊహాగానాలకు తెరలేపినట్లైంది.
ఇప్పటికే రెండుసార్లు ఈ వార్తలను సమంత టీమ్ ఖండించగా తాజాగా మరోసారి సమంత ఆరోగ్యం విషమం అని పుకార్లు చెలరేగడంతో మళ్ళీ సమంత టీమ్ స్పందించింది. సమంతకు ఎలాంటి అనారోగ్యం లేదని , చికిత్స కోసం ఏ దేశం కూడా వెళ్లడం లేదని కుండబద్దలు కొట్టారు.
దాంతో ఈ పుకార్లకు ప్రస్తుతానికైతే తెరపడినట్లే ! కానీ ఇలాంటి రాతగాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. సమంత నటించిన యశోద ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో డిసెంబర్ లో ఓటీటీ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.