అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం రికార్డుల మోత మోగించడంతో దానికి సీక్వెల్ గా పుష్ప 2 చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తుండగా రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ చిత్రంలో రష్మీక మందన్న తో పాటుగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి నటిస్తే ఆమె పాత్ర ఎలా ఉంటుంది అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఇది నిజమేనా ? అని ఆరా తీయగా వాస్తవం కాదని తెలుస్తోంది. పుష్ప 2 లో సాయి పల్లవి నటించడం లేదని, ఎవరో కావాలని ఈ పుకార్లు పుట్టించి ఉంటారని అంటున్నారు ఆ చిత్ర బృందం.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తెలుగు చిత్రాలతో పాటుగా తమిళ , మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. కొన్ని హిట్స్ ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో ఈ భామ నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దాంతో కొంత డైలమాలో పడింది. సాయి పల్లవి ఓ బ్లాక్ బస్టర్ చిత్రంలో నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు అభిమానులు. కానీ ఈ భామ మాత్రం కమర్షియల్ చిత్రాలను చేయడం లేదు.