ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ” పుష్ప 2”. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఫహద్ ఫాజిల్ , సునీల్ , అనసూయ తదితరులు నటిస్తున్నారు. పుష్ప అఖండ విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు సుకుమార్.
హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవిని అల్లు అర్జున్ పుష్ప 2 లో తీసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఆరు నెలల క్రితం కూడా వినిపించాయి. అయితే అప్పుడు ఆ వార్తలను కొట్టిపడేసారు మేకర్స్ . అలాగే సాయి పల్లవి కూడా పుష్ప 2 చేయడం లేదని చెప్పింది. కట్ చేస్తే దర్శకుడు సుకుమార్ సాయి పల్లవిని కలిసి కథ చెప్పి అందులో సాయి పల్లవి పాత్రకు ఎంతటి ప్రాధాన్యముందో వివరించాడట.
దాంతో సాయి పల్లవి కన్విన్స్ అయినట్లుగా తెలుస్తోంది. సాయి పల్లవి అంత ఈజీగా సినిమాలను అంగీకరించడం లేదు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలనే రిజెక్ట్ చేసింది. తనకు పూర్తిగా నచ్చితేనే చేస్తుంది అంతేకాని పెద్ద స్టార్ హీరో కాబట్టి చేయను అని మొహమాటం లేకుండా చెబుతుంది. దాంతో కాబోలు ఈ భామకు పొగరెక్కువ అని తెగ ప్రచారం అవుతోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే …… సాయి పల్లవి పుష్ప 2 లో నటించనుంది అనే వార్త అల్లు అర్జున్ అభిమానులను సంతోషానికి గురి చేసే అంశమనే చెప్పాలి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.