sai dharam tej ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే నామ స్మరణ.. బ్రో అనే పేరునే అందరి నోటా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.
ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని ఎదురు చూసే వారికి మరో వారం రోజులు ఎదురు చూపులు తప్పవు.. ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమాకే భారీ లెవల్ లో హైప్ ఉంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మామ అల్లుడు కలిసి నటించడంతో చాలా అరుదైన సంఘటనలు జరిగాయి.. వాటిని ప్రమోషన్స్ లో సాయి తేజ్ పంచుకోవడంతో ఇవి మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. తాజాగా పవన్ సెట్స్ లో సాయి ధరమ్ తేజ్ తాగి వచ్చాడా అని అడిగారట.. ఎందుకంటే..
బ్రో సినిమాలో కేక్ తినిపించే సీన్ దగ్గర బాగా ఇబ్బంది పడ్డానని.. అది ఒక డ్రింక్ సీన్ అని పవన్ ముందు తాగుతూ నటించే సన్నివేశం కాబట్టి కాస్త ఇబ్బంది పడిన ఆ సీన్ పెర్ఫెక్ట్ గా వచ్చింది అని తెలిపారు. అయితే ఈ సీన్ తర్వాత పవన్ నా వద్దకు వచ్చి సెట్స్ కు తాగి వచ్చావా అని అడిగారని లేదు అని చెప్పడంతో బాగా చేసావని మెచ్చుకున్నారని తాగుడు మీద మంచి పట్టు ఉందని ఆటపట్టించారని సాయి తేజ్ తెలిపాడు.. ఇలాంటివి చాలా జరిగాయని ఈ సినిమాను థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి అంటూ ఈయన కోరారు.