సమంత విడాకులు తీసుకొని దాదాపు ఏడాది కావస్తున్న సందర్భంగా ఆమె తండ్రి ఎమోషనల్ పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత , అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్ళైన మొదట్లో బాగానే ఉన్నారు. కట్ చేస్తే ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. దాంతో గత ఏడాది విడిపోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుండి సమంత ఒంటరిగానే ఉంటోంది. కొన్నాళ్ళు తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నప్పటికి ఆ తర్వాత తేరుకొని మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. దాంతో కొత్త జీవితాన్ని ప్రారంభించామని సమంత తండ్రి కోరుతున్నాడు. దాంతో సమంత మళ్లీ పెళ్లి చేసుకోనుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని అందుకే ప్రస్తుతానికి సోలో బ్రతుకే సో బెటర్ అని భావిస్తోంది.