రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు సారీ చెప్పింది స్టార్ హీరోయిన్ సమంత. విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత సారీ చెప్పడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈరోజు సమంత కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యింది. గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత షూటింగ్ లకు వెళ్లడం లేదు. దాంతో పలు షూటింగ్ లు వాయిదా పడ్డాయి. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి చిత్రం కూడా ఒకటి.
విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే మిగతా షూటింగ్ పూర్తి చేయాలంటే సమంత రావాలి. కానీ అనారోగ్య కారణాలతో సమంత షూటింగ్ కు రాలేదు……ఇక అప్పటి నుండి ఖుషి మూలాన పడింది. తన వల్లే ఖుషి సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులకు సారీ చెబుతోంది సమంత.
ఇక ఈరోజు హిందీ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది. దాంతో తన కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండతో షూటింగ్ లో పాల్గొనకుండా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొనడంతో కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నించారు దాంతో రౌడీ హీరో ఫ్యాన్స్ కు సారీ చెప్పింది అదన్న మాట అసలు సంగతి.