
స్టార్ హీరోయిన్ సమంత హైద్రాబాద్ కు గుడ్ బై చెప్పనుందా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. సమంత స్వస్థలం చెన్నై దాంతో ఎక్కువ కాలం చెన్నై లోనే ఉంటోంది. అయితే నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ కు మకాం మార్చింది. ఇక్కడే విలాసవంతమైన విల్లా కొనుగోలు చేసింది. అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం చెన్నై లో అలాగే కొంతకాలం హైద్రాబాద్ లో ఉంటోంది.
ఇక ఇప్పుడేమో సమంత దృష్టి బాలీవుడ్ , హాలీవుడ్ మీద పడింది. పైగా సెటా డెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ హిందీ వెబ్ సిరీస్ కోసం ఎక్కువ కాలం ముంబైలోనే ఉండనుంది. దాంతో హైదరాబాద్ కు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉందట. వెబ్ సిరీస్ తో పాటుగా పలు హిందీ చిత్రాల్లో నటించాలని ఆశగా ఎదురు చూస్తోంది సమంత. దాంతో ముంబైలోనే మకాం పెడితే కరెక్ట్ అని భావించిందని తెలుస్తోంది.
తాజా విషయానికి వస్తే …… సమంత నటించిన శాకుంతలం చిత్రం రెండుసార్లు వాయిదాపడింది. ఈనెల 17 న విడుదల అన్నారు కట్ చేస్తే మరోసారి వాయిదా పడినట్లు ప్రకటించారు. గతంలో కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తీరా సమయానికి వాయిదా వేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అనే అనుమానం నెలకొంది.