సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ సమంత తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటో తెలుసా …… ఇక నుండి ఎక్స్ పోజింగ్ చేయనని , అలాగే హీరోలతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనని , అరకొర దుస్తులు వేసుకోనని దర్శకులకు చెబుతోందట. అంతేకాదు తన దగ్గరకు వచ్చే కొత్త దర్శకులకు ఇదే విషయం చెబుతోందట. అంతేనా ….. మరో షాకింగ్ ఏంటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని అంటోందట.
అసలు సమంత అంటేనే సోషల్ మీడియా. ఎందుకంటే తరచుగా సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు తనకు సంబందించిన ఫోటోలను కూడా పెడుతూనే ఉంటుంది. అలాగే పలు విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటుంది సమంత. ఇలా చేయడం వల్ల సమంత అభినందనలు అందుకుంది….. అలాగే పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొంది.
ఎక్స్ పోజింగ్ చేయనని చెప్పడం మాత్రం చాలా పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే సమంత అంటేనే చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోలకు ఫోజిచ్చి వాటిని తన ట్విట్టర్ లో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేది. మరి అలాంటి సమంత ఎక్స్ పోజింగ్ కు దూరం అంటే కుర్రాళ్ళ గుండెల్లో బాంబ్ పెట్టినట్లే !