స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో మూడు నెలల పాటు ఎలాంటి షూటింగ్ లలో పాల్గొనకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంది. ఇక ఇటీవలే సెటా డెల్ అనే హిందీ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్ళింది. ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు మయోసైటీస్ కు చికిత్స తీసుకుంటోంది. బలం కోసం ఖరీదైన ఇంజక్షన్ లను కూడా వాడుతోంది. దాంతో కాస్త బాగానే ఉంది సమంత.
వెబ్ సిరీస్ లో యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట దాంతో ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు జిమ్ లో తెగ కష్టపడుతోంది. జిమ్ ట్రైనర్ ఇస్తున్న సూచనలు పాటిస్తూ కఠోరంగా శ్రమిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది సమంత. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
సమంత నటించిన శాకుంతలం ఈనెల 17 న విడుదల కావాల్సి ఉండే కానీ చివరి నిమిషంలో విడుదల తేదీని వాయిదా వేశారు. అలాగే కొత్త విడుదల తేదీ ప్రకటించారు. ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా శాకుంతలం భారీ ఎత్తున విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై సమంత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రానికి అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.
View this post on Instagram