మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఎట్టకేలకు కాస్త కోలుకుంది దాంతో డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత అన్ని పరీక్షలు చేయించుకోగా మాయోసైటిస్ అనే వ్యాధి తెలిసింది. దాంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యింది. అయితే డాక్టర్ల పర్యవేక్షణ , సమంత మనో నిబ్బరంతో కోలుకుంది.
దాంతో శాకుంతలం డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. నాకు వచ్చిన వ్యాధికి ఇదే సరైన మందు అని అంటోంది. సినిమాలే ప్రపంచంగా పెరిగిన సమంత …… ఈ వ్యాధి నుండి బయట పడాలంటే మళ్ళీ సినిమాల్లో బిజీ కావడం వల్లే సాధ్యం అవుతుందని నమ్ముతోంది అందుకే మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఆశపడుతోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 17 న ఈ సినిమా విడుదల కానుంది. దాంతో జనవరి 9 న శాకుంతలం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. జనవరి 9 న మధ్యాహ్నం శాకుంతలం ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాపై సమంత ఎన్నో ఆశలు పెట్టుకుంది.