
తాజాగా సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో అలా పోస్ట్ చేసింది తన మాజీ భర్త నాగచైతన్య గురించే అయి ఉంటుందని నెటిజన్లు రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటో తెలుసా ……. ”నువ్వు ఎప్పటికీ ఒంటిరిగా ప్రయాణం చేయలేవు ” అని కోట్ చేయడమే !
గతకొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ఇటీవలే మళ్ళీ సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ అవడమే …… ”వెనక్కి తగ్గాను కానీ ఓడిపోలేదు ” అంటూ పోస్ట్ చేసి లైన్ లోకి వచ్చింది. ఇక ఇప్పుడేమో ఒంటరిగా ప్రయాణం చేయలేవు అని కామెంట్ చేసిందంటే ఖచ్చితంగా మాజీ భర్త నాగచైతన్య గురించే అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇటీవల నాగచైతన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ రకరకాల పుకార్లు వినిపించాయి. మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ వార్తలు వచ్చాయి. బహుశా వాటి గురించే సమంత పోస్ట్ చేసి ఉంటుందని భావిస్తున్నారు నెటిజన్లు. సమంత మాత్రం విడాకుల విషయాన్ని పక్కన పెట్టి సినిమాల మీద సినిమాలు అంగీకరిస్తూ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. యశోద సినిమా తెలుగు , తమిళ భాషల్లో రూపొందింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.