
స్టార్ హీరోయిన్ సమంత పై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ సమంత పై నెటిజన్లకు కోపం ఎందుకో తెలుసా …… ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా మాట్లాడటమే ! గతంలో అలాగే ఇటీవల కూడా మోడీ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసింది సమంత. అంతేకాదు మోడీ నాయకత్వంలోనే దేశం ఆర్ధికంగా మరింతగా బలోపేతం అవుతుందని చెప్పింది.
ఇదే కొంతమంది నెటిజన్లకు కోపం వచ్చేలా చేసింది. సామాన్యులు వాడే గ్యాస్ సిలిండర్ ధర ఒకప్పుడు 600 లోపు ఉండేది కానీ ఇప్పుడు 1100 దాటింది ఇదేనా ప్రగతి అంటూ సమంతని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు సమంత మోడీ పై చేసిన వ్యాఖ్యలకు సంబందించిన పాత వీడియోని షేర్ చేసి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.
సమంత ప్రస్తుతం శాకుంతలం , యశోద , ఖుషి చిత్రాల్లో నటిస్తోంది. శాకుంతలం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక యశోద చిత్రం విడుదలకు సిద్ధమైంది. విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. బాలీవుడ్ లో హాలీవుడ్ లో నటించాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ భామ.