స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. అంతేకాదు తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలు కూడా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సోషల్ మీడియాలో తన వ్యాధి గురించి పోస్ట్ చేయడంతో అది ఎన్టీఆర్ దృష్టికి వచ్చింది. దాంతో ఆమెకు ధైర్యాన్ని నూరిపోసాడు. మేము అండగా ఉన్నామని, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా ట్వీట్ చేసాడు ఎన్టీఆర్. ఇప్పుడీ పోస్ట్ మరింత వైరల్ గా మారింది.
సమంత గతకొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన వాళ్లకు కండరాల బలహీనతతో పాటుగా , ఎక్కువగా నిల్చోలేక పోవడం , నీరసంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. మయో సైటిస్ సమంతను మరింతగా ఇబ్బంది పెడుతుండటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. సమంతకు అరుదైన వ్యాధి సోకిందనే వార్తలు దావానలంలా వ్యాపించింది. దాంతో సమంత అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అలాగే సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.