
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” శాకుంతలం ”. పాన్ ఇండియా చిత్రంగా విడుదల అవుతున్న ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉండే. కానీ విజువల్స్ బెటర్ మెంట్ కోసం …… పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడం కోసం వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈరోజు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ శాకుంతలం రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా ……. 2023 ఫిబ్రవరి 17 న.
సమంత శకుంతలగా నటించగా గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందడం విశేషం. శాకుంతలం చిత్ర బడ్జెట్ ఎంతో తెలుసా ….. 70 కోట్లు. మరి ఈ బడ్జెట్ సమంత స్టార్ డం వల్ల పొందుతారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే !
ఎందుకంటే ఇటీవలే సమంత నటించిన యశోద వచ్చింది. మంచి టాక్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు అయితే రాలేదు. మరో 70 కోట్ల బడ్జెట్ అంటే 150 కోట్ల వసూళ్లు సాధించాలి బాక్సాఫీస్ వద్ద. శాకుంతలం ఎంత సాధిస్తుంది అన్నది చూడాలి. ఫిబ్రవరి 17 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గుణశేఖర్.