నాగచైతన్య అంటే సమంతకు ఇంకా కోపం తగ్గలేదు ……. దానికి సాక్ష్యం ఇదిగో ……. ఏ మాయ చేసావే అనే సినిమా విడుదలై 13 ఏళ్ళు కావడంతో ఆ సినిమా స్టిల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. అయితే అందులో నాగచైతన్య లేకపోవడం ఇందుకు కారణం. అయితే అదే సమయంలో నాగచైతన్య మాత్రం సమంతతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
చైతూ సమంతతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి తన సమంత పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు. అయితే అందుకు భిన్నంగా సమంత మాత్రం చైతూపై చాలా ఆగ్రహంగా ఉందనే విషయాన్ని మరోసారి చాటుకుంది. చైతూ లేని స్టిల్ సినిమా స్టిల్ మాత్రమే పోస్ట్ చేసింది. దాంతో చైతూ పై సమంతకు ఇంకా కోపం తగ్గలేదనే సంకేతాలు పంపించినట్లయింది.
13 సంవత్సరాల క్రితం నాగచైతన్య – సమంత జంటగా నటించిన ” ఏ మాయ చేసావే ” అనే సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. నాగచైతన్య కు సాలిడ్ హిట్ ని అందించింది. అలాగే సమంత బెస్ట్ డెబ్యూ అయ్యింది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈ సినిమా తర్వాత సమంత – చైతూ పలు చిత్రాల్లో నటించారు. అలా ప్రేమలో పడ్డారు ….. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు.
కట్ చేస్తే నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు. సమంత – చైతూ విడిపోయి ఏడాదిన్నర అవుతోంది. అంతకంటే ముందే దూరంగా ఉన్నారు. విడిపోయి ఇన్నాళ్లు అవుతున్నా ఇంకా సమంతకు మాత్రం కోపం తగ్గలేదు అనడానికి సమంత చేసిన పోస్ట్ మరోసారి రుజువు చేస్తోంది.