సమంత నటించిన యశోద చిత్ర ట్రైలర్ ని భారీ ఎత్తున విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసారు. మొదట ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ భాషల్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మారింది. పాన్ ఇండియా లెవల్లో యశోద చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు యశోద మేకర్స్.
ఈరోజు సాయంత్రం తెలుగు చిత్ర ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నాడు. ఇక ఇదే సమయంలో తమిళ ట్రైలర్ ను హీరో సూర్య విడుదల చేయనున్నాడు. అలాగే కన్నడ ట్రైలర్ ను రక్షిత్ శెట్టి , మలయాళ ట్రైలర్ ను దుల్కర్ సల్మాన్ విడుదల చేయనున్నారు. అంటే యశోద చిత్రం పాన్ ఇండియా చిత్రం అన్నమాట.
ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ లను విడుదల చేయడం ద్వారా యశోద పై మరిన్ని అంచనాలు పెంచడానికి సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే యశోద టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ యశోద చిత్రం నవంబర్ 11 న విడుదల కానుంది.