స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం యశోద. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా వచ్చిన ఈ చిత్రం నవంబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
అయితే సరోగసీ నేపథ్యంలో రూపొందడంతో ఈవా సంస్థ పేరు వాడటంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. చిత్ర నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ చొరవతో వివాదం సద్దుమణిగింది. దాంతో డిసెంబర్ 9 న అమెజాన్ ప్రైమ్ లో యశోద చిత్రం స్ట్రీమింగ్ కు వస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈనెల 9 న మాత్రం అమెజాన్ లో రావడం ఖాయమని తెలుస్తుంది.