సమంత నటించిన యశోద చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. హరి అండ్ హరీష్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆదిత్య 369 వంటి క్లాసిక్ చిత్రాన్ని నిర్మించిన శివలంక కృష్ణప్రసాద్ నిర్మించారు. యశోద టీజర్ కు అద్భుతమైన స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు.
యశోద చిత్రాన్ని తెలుగులో తమిళ్ లో విడుదల చేయనున్నారు. సమంత ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. గతకొంత కాలంగా సమంత బాలీవుడ్ పై దృష్టి సారించింది. యశోద కు పాజిటివ్ టాక్ వస్తే హిందీలో కూడా డబ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ఎందుకంటే ఇటీవల తెలుగు సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడుతోంది. దాంతో యశోద కూడా బాలీవుడ్ లో విడుదల అవడం ఖాయమని భావిస్తున్నారు.