
స్టార్ హీరోయిన్ సమంతకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు…… సమంతకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. అయితే సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య మాత్రం ఇంతవరకు స్పందించలేదు. సమంతకు బాసటగా నిలవలేదు. దాంతో సోషల్ మీడియాలో చైతూ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమంత అభిమానులు. అంతేకాదు పలు మీమ్స్ తో చైతూ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
సమంత – నాగచైతన్య లు విడిపోయిన సమయంలో నెటిజన్లు ఎక్కువగా సమంత నే విమర్శించారు. చైతూ తప్పు లేదని , సమంత చెడు తిరుగుళ్ల వల్లే విడిపోయే పరిస్థితి తలెత్తిందని దారుణమైన కామెంట్స్ చేశారు. దాంతో విడాకుల కంటే నెటిజన్ల కామెంట్స్ వల్ల ఎక్కువగా మానసిక ఆందోళనకు గురయ్యింది. కట్ చేస్తే …… మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా తలకిందులు అయ్యింది పరిస్థితి.
ప్రస్తుతం సమంతకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా నెటిజన్ల నుండి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అక్కినేని అఖిల్ కూడా సమంతకు బాసటగా నిలిచాడు కానీ నాగచైతన్య మాత్రం ఇంతవరకు స్పందించలేదు దాంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.