స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ” శాకుంతలం ”. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి నిర్మిస్తున్నాడు గుణశేఖర్. అసలు ఈ సినిమా గత ఏడాది 2022 లోనే విడుదల కావాల్సి ఉండే. కానీ గ్రాఫిక్స్ పని ఇంకా పెండింగ్ లో ఉన్నందున ఫిబ్రవరి 17 కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ఇప్పుడేమో ఫిబ్రవరి నెల రానే వచ్చింది. ఫిబ్రవరి 17 న విడుదల కావడంతో ప్రమోషన్స్ మొదలు పెడతారేమో అనుకుంటే శాకుంతలం మరోసారి వాయిదా పడుతోంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దర్శక నిర్మాత గుణశేఖర్ మాత్రం ఇప్పటి వరకు శాకుంతలం పోస్ట్ పోన్ గురించి స్పష్టత ఇవ్వలేదు దాంతో మరింతగా ఈ ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.
శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఫిబ్రవరి 17 న కాకుండా మార్చిలో లేదంటే ఏప్రిల్ లో విడుదల కానుందని తెలుస్తోంది. మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా గుణశేఖర్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడమో లేక మీడియా ముందుకు స్వయంగా రావడమో చేయక తప్పదు. దాంతో క్లారిటీ వస్తుంది.