
స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద చిత్రం ఓటీటీ డేట్ లాక్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు ? ఎక్కడ ? స్ట్రీమింగ్ కానుందో తెలుసా …….. డిసెంబర్ 9 న …….. అమెజాన్ ప్రైమ్ లో . అవును డిసెంబర్ 9 న అమెజాన్ ప్రైమ్ లో సమంత యశోద స్ట్రీమింగ్ కి రానుంది. సరోగసీ నేపథ్యంలో జరిగే అవకతవకల గురించి ఈ చిత్రం రూపొందింది.
నవంబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ చిత్రాన్ని నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని అనుకున్నాడు. ఆశించిన స్థాయిలో భారీ సక్సెస్ అందకపోవడంతో వెంటనే ఓటీటీ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు.
అయితే అప్పుడే అనుకోని వివాదం యశోద చిత్రాన్ని చుట్టుముట్టింది. యశోద చిత్రంలో అవకతవకలకు పాల్పడే సరోగసీ సంస్థ పేరు ” ఇవా ” కాగా ఇదే పేరుతో హైదరాబాద్ లో ఓ సరోగసీ సంస్థ ఉండటం గమనార్హం దాంతో ఆ సంస్థ మా ప్రతిష్టకు భంగం కలిగింది అంటూ 5 కోట్లకు దావా వేసింది.
దాంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం యశోద చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఉక్కిరి బిక్కిరి అయిన నిర్మాత వెంటనే ఇవా ఎండి ని కలిసి అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించడానికి ఒప్పుకున్నాడు దాంతో వివాదం సద్దుమణిగింది.
వివాదం సమసిపోవడంతో ఎట్టకేలకు యశోద ఓటీటీ కి అడ్డంకులు తొలగిపోయాయి. దాంతో డిసెంబర్ 9 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వస్తోంది. సమంత కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది యశోద. సమంత మాయో సైటిస్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది.